PM Modi Uzbekistan Kyrgyzstan Visit
అకేరు న్యూస్ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లలో నాలుగు రోజుల పర్యటన చేపట్టనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ఆగస్టు 29, 30 తేదీల్లో తాష్కెంట్లో పర్యటించనున్న మోడీ, ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య తదితర రంగాల్లో సహకారంపై ఇరుదేశాల నేతలు చర్చించనున్నారు. అనంతరం ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు కిర్గిజ్ రాజధాని బిష్కెక్లో జరిగే 26వ ఎస్సీఓ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొననున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
