MLA Kadiyam Srihari
* ఎమ్మెల్యే కడియం శ్రీహరి
* ఫిజియో థెరఫీ క్లినిక్ ప్రారంభం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
తక్కువ ఖర్చులోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘రిలీఫ్ ఫిజియో థెరఫీ క్లినిక్’ ను స్థానిక ఎమ్మెల్యే శ్రీహరి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లినిక్‌లోని వైద్య పరికరాలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుతున్న జీవనశైలితో ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే నడుము, మెడ , కీళ్ల నొప్పులు, పక్షవాతం వంటి సమస్యలతో బాధ పడేవారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఫిజియోథెరపీ వైద్యసేవలు స్థానికంగా అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, క్లినిక్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
