Errabelli Dayakar Rao Bonalu
* ఘనంగా ముత్యాలమ్మ, పోచమ్మ బోనాలు
ఆకేరు న్యూస్,దేవరుప్పుల: మండలంలో ఆదివారం గ్రామీణ పండుగ వాతావరణం ఉట్టిపడింది. ఈకామారెడ్డిగూడెం గ్రామంలో నిర్వహించిన ముత్యాల పండుగ బోనాలు, చౌడూరు గ్రామంలో జరిగిన పోచమ్మ బోనాల వేడుకల్లో పంచాయతీ రాజ్ శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
గ్రామాల్లో ఆధ్యాత్మిక ఉత్సాహం నడుమ మహిళలు భక్తిశ్రద్ధలతో సిద్ధం చేసిన బోనాలను ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా నెత్తిన ఎత్తుకుని ఊరేగింపులో నడిచారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామస్తులు అందరూ ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని మొక్కులు చెల్లించుకున్నారు.
* ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ
”మన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక.”
”తెలంగాణ పల్లెల్లో దేవతల పండుగలను ప్రజలంతా కలిసికట్టుగా, ఐక్యంగా జరుపుకోవడం ఎంతో సంతోషకరం.”
”ముత్యాలమ్మ, పోచమ్మ అమ్మవార్ల దయాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, గ్రామాలు పచ్చదనంతో, పాడిపంటలతో వర్ధిల్లాలని కోరుకున్నాను.”
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
