Telangana Yellow Alert
* తెలంగాణలో పలు జిల్లాలకు జారీ
* అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో కూడా వర్ష సూచన ఉంది. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అటు హైదరాబాద్‌తో పాటు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆగస్టు 31న తెలంగాణకు ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలుల హెచ్చరికను ఐఎండీ కూడా జారీ చేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
