AP CM Chandrababu Naidu inaugurate Veligonda Project Phase 1
* నేడు వెలిగొండకు కృష్ణమ్మ జలాలు!
* ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించనున్న ఏపీ సీఎం
* 30 ఏళ్ల నిరీక్షణకు తెర
అకేరు న్యూస్, మార్కాపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను ఆయన ప్రారంభించనున్నారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు తొలి దశను అదే చంద్రబాబు నేడు ప్రారంభించడం విశేషం. పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చి, ప్రాజెక్టు గేట్లను ప్రారంభించి నల్లమలసాగర్ జలాశయానికి నీటిని విడుదల చేయనున్నారు. ఫేజ్-1 ద్వారా నల్లమలసాగర్‌లో సుమారు 10.70 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉండగా, తొలి దశలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు సుమారు 4 లక్షల మందికి తాగునీటి ప్రయోజనం కలగనుంది. ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదికలో భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో కరవు ప్రాంతాల రైతాంగానికి సాగునీటి భరోసా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
