* నర్స్ హత్య కేసులో అమానుషం
* లైంగికదాడి
* రంగారెడ్డి జిల్లాలో దారుణం
* నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని బాధితురాలి బంధువులు డిమాండ్
ఆకేరు న్యూస్, రంగారెడ్డి : మానవత్వం మంటకలుస్తోంది.. కామ వాంఛతో మృగంలా మారాడో మనిషి.. ఓ యువతిపై లైంగికదాడికి యత్నించగా వ్యతిరేకించడంతో చంపి శవంతో కోరిక తీర్చుకున్నాడో దుర్మార్గుడు. ఈ అమానవీయ ఘటనపై సమాజం దిగ్భ్రాంతికి లోనయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఆస్పత్రి యాజమాన్యం సమీపంలో కల్పించిన విశ్రాంతి గది (హాస్టల్)లో ఆమె తోటి సిబ్బందితో కలిసి నివాసముంటోంది. శుక్రవారం రాత్రి రూమ్మేట్స్ ఊరికి వెళ్లడంతో ఆమె గదిలో ఒంటరిగా ఉంది. ఆ సమయాన్ని గమనించిన నిందితుడు బిహార్‌వాసి మహ్మద్ సనావుల్లా (34) సమీపంలోని షాపులో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఒంటరిగా ఉన్న ఆమె గదిలోకి ప్రవేశించాడు. నిందితుడు ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా, బాధితురాలు ప్రతిఘటించి కేకలు వేసింది. దీంతో భయపడిన నిందితుడు ఆమె నోరు మూసి, ఇనుప రాడ్ దాడి చేసి, గొంతు నులిమి హత్య చేశాడు. బాధితురాలు మరణించిన తర్వాత కూడా నిందితుడు లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాల ద్వారా అనుమానిస్తున్నారు.
మరుసటి రోజు (శనివారం) మధ్యాహ్నం వరకు నర్సు విధులకు రాకపోవడం, ఎంత పిలిచినా గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన తోటి సిబ్బంది కిటికీలోంచి చూడగా ఆమె రక్తపు మడుగులో కనిపించింది. పహాడీషరీఫ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితుడు సనావుల్లాను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వద్ద బాధితురాలి కుటుంబ సభ్యులు, పలు సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన చేశారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
