Delhi Bus Gang Rape Case
* బాలికపై సామూహిక అత్యాచారం
* దేశ రాజధాని ఢిల్లీలో దారుణం
* ఆగస్టు 4న ఘటన
* ఆలస్యంగా వెలుగులోకి..
ఆకేరు న్యూస్, ఢిల్లీ : 2012లో జరిగిన నిర్భయ ఘటన దేశ రాజధానిలో పునరావృతమయ్యింది. ఎన్ని చట్టాలు చేసినా పిల్లలు, మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 4న రాత్రి ఈ ఘటన జరిగింది. బాలికను బస్సులో ఉంచి సుమారు 45 నిమిషాల పాటు రోడ్డుపై తిప్పుతూ ఇద్దరు నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనకు ఉపయోగించిన స్లీపర్ బస్సును సీజ్ చేశారు. అనంతరం ఫోరెన్సిక్ నిపుణులతో బస్సులో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
