VGPP Telangana Village Planning
ఆకేరు న్యూస్, కమలాపూర్: వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా కమలాపూర్ మండలంలో గ్రామ పంచాయతీ ప్రణాళిక (VGPP) రూపకల్పన ప్రక్రియ మొదలైంది. క్షేత్రస్థాయి వాస్తవ అవసరాలు, లోటుపాట్లను గుర్తిస్తూ బాటమ్-అప్ విధానంలో ఈ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా నీటి భద్రత, మౌలిక వసతులు, జీవనోపాధి, విద్యుత్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి కోసం పూర్తిగా క్షేత్రస్థాయి నుంచి బాటమ్-అప్ పార్టిసిపేటరీ ప్లానింగ్ ప్రాసెస్ విధానంలో ఈ వీజీపీపీలను తయారు చేయనున్నారు.
* ప్రత్యేక బృందాలు – మండల ప్రణాళిక షెడ్యూల్
కమలాపూర్ మండల పరిధిలోని గ్రామాలను MPDO, APO, EC ల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలకు కేటాయించారు. ఈ బృందాలలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండనున్నారు. తాజా షెడ్యూల్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ సెప్టెంబర్ 16 వరకు కొనసాగనుంది. కాగా మండలంలో ప్లానింగ్ ప్రాసెస్ మొదటి గ్రామ సభ, ప్రణాళిక తయారీ కాలం, తుది గ్రామసభ అని మూడు దశల్లో చేపట్టనున్నారు.
* మొదటి గ్రామసభ
మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో సెప్టెంబర్ 1 నుంచి 3 వ తేదీ మధ్యలో మొదటి గ్రామసభలు నిర్వహించనున్నారు. ఇందులో VB-G RAM G లక్ష్యాలు, ప్రగతి నివేదిక, గత సంవత్సర ఖర్చులు, పూర్తి, ప్రగతిలో ఉన్న పనుల వివరాలతో పాటు 318 పనుల జాబితాను పరిశీలిస్తారు.
* ప్రణాళిక తయారీ కాలం
సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 12 వ తేదీ వరకు ఆయా గ్రామాల్లో ట్రాన్సెక్ట్ వాక్ నిర్వహించి, పనులను గుర్తించి ప్రణాళికలను రూపొందిస్తారు.
* తుది గ్రామసభ, ఆమోదం
సెప్టెంబర్ 15, 16 తేదీలలో రెండవ గ్రామసభలను నిర్వహించి, ప్రతిపాదిత పనులు, లబ్ధిదారుల వివరాలు, అంచనా వ్యయంతో కూడిన తుది VGPP ప్రణాళికను అధికారికంగా ఆమోదించనున్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈ షెడ్యూల్ కచ్చితంగా అమలయ్యేలా చూస్తూ, నిర్దేశిత గడువులోగా వీజీపీపీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
