Kadiyam Kavya LOC Assistance
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన సదాల సంతోషికి వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య రూ. 2 లక్షల 50 వేల విలువ గల ఎల్.ఓ.సి అందించారు. నమిలిగొండ గ్రామానికి చెందిన సదాల సంతోషి అనారోగ్యంతో బాధపడుతు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఒమేగా ఆసుపత్రిలో చేర్పించారు.
వారి ఆర్థిక పరిస్థితిని మాజీ ఎంపీటీసీ పూరుమాని రజాక్ యాదవ్ వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య దృష్టికి తీసుకెళ్లగా స్పందించి ప్రధానమంత్రి సహాయ నిధి నుండి రూ. 2 లక్షల 50 వేల విలువగల ఎల్.ఓ.సి మంజూరు చేపించి హనుమకొండ లోని ఎంపీ నివాసంలో బాధితురాలి కుటుంబ సభ్యులకు అందించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
