GWMC Commissioner Sanitation
* డివైడర్లు, ప్రధాన రహదారులు పరిశుభ్రంగా ఉంచాలి
* జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న
* అధికారుల తీరుపై అసహనం
ఆకేరు న్యూస్, వరంగల్ : నగరంలోని ప్రధాన రహదారులు, డివైడర్లు, ప్రధాన కూడళ్లలో పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కమిషనర్ నగరంలోని పలు ప్రధాన రహదారులు, డివైడర్లు, కూడళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని ప్రధాన రహదారులు, డివైడర్లు, ప్రధాన కూడళ్లలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. రహదారుల డివైడర్లపై చెత్త, మట్టి, ఎండిన ఆకులు, చెట్ల కొమ్మలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డివైడర్లు, ప్రధాన రహదారులు నిత్యం పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా కనిపించేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, విధుల్లో అలసత్వం వహించినా చర్యలు తీసుకుంటామని శానిటరీ ఇన్స్పెక్టర్లను హెచ్చరించారు. తమ పరిధిలోని ప్రాంతాల్లో ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. అనంతరం లక్ష్మీపురం మార్కెట్లో మంజూరైన కంప్రెస్డ్ బయో మిథనైజేషన్ (సీబీజీ) ప్లాంట్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్లాంట్‌కు సంబంధించిన వర్క్ టెండర్ ప్రక్రియ పూర్తయినా పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంపై ఆరా తీశారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టడంతో పాటు, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని పేర్కొన్నారు. ఆయనతో పాటు సీఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేందర్, ఎంహెచ్వో రాజేష్, డీఈలు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
