YS Jagan Kadapa Tour
* వైఎస్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులు
* అక్కడ ప్రత్యేక ప్రార్థనల నిర్వహణ
* పార్టీ నాయకులు, ప్రజలనూ కలుసుకోనున్న మాజీ సీఎం
ఆకేరు న్యూస్, కడప జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేటి (మంగళవారం) నుంచి రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో ప్రజలను కలుసుకోవడంతో పాటు, తన తండ్రి, మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించనున్నారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకోనున్న జగన్, అక్కడి క్యాంపు కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్బార్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆయన కలుసుకుని వారి సమస్యలు, తెలుసుకోనున్నట్లు సమాచారం. స్థానికంగా ఉన్న పలు అంశాలపై కూడా పార్టీ నాయకులతో జగన్ చర్చించే అవకాశం ఉంది. రేపు (బుధవారం) పులివెందుల నుంచి ఇడుపులపాయకు బయలుదేరనున్న జగన్, వైఎసఆర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్దకు చేరుకుని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘనంగా నివాళులర్పించనున్నారు. వైఎసఆర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్ అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇడుపులపాయకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం జగన్ తన పర్యటనను ముగించుకుని బెంగళూరుకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. ఈ కార్యక్రమాలతో జగన్ పర్యటనకు రాజకీయంగా, భావోద్వేగపరంగా ప్రాధాన్యత ఏర్పడింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
