Jal Jeevan Mission Review Meeting
* ఈ విషయంపై ఢిల్లీలో కీలక సమావేశాలు
* జల్ జీవన్ మిషన్పైౖ రెండు రోజుల సమీక్ష
* పలు రాష్ట్రాల సీఎంలు, జల వనరుల మంత్రుల హాజరు
* హర్ ఘర్ నల్ జల్ పురోగతిపై చర్చ
* హాజరు కానున్న ప్రధాని మోదీ
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక జల్ జీవన్ మిషన్పైౖ నేడు, రేపు న్యూఢిల్లీలో కీలక సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ రెండు రోజుల సమావేశాలకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జల వనరుల శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. జల్ జీవన్ మిషన్లో భాగంగా అమలు చేస్తున్న హర్ ఘర్ నల్ జల్ కార్యక్రమం పురోగతి, ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలు, ఇంకా పూర్తి చేయాల్సిన పనులపై సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ద్వారా తాగునీరందించే లక్ష్య సాధనలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ‘జల్ జీవన్ మిషన’కు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న బకాయిలు, పెండింగ్ నిధులు, నిధుల విడుదల వంటి అంశాలు కూడా కీలకంగా చర్చకు రానున్నాయి. వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కోసం తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై కూడా సమావేశంలో సమీక్షించనున్నారు. వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదల వంటి అంశాల నేపథ్యంలో భవిష్యత్తులో తాగునీటి అవసరాలను ఎలా తీర్చాలనే దానిపై కేంద్రం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. నీటి వనరుల పరిరక్షణతో పాటు అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై కూడా చర్చ జరగనుంది. రెండోరోజూ జరిగే కీలక సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. జల్ జీవన్ మిషన్ అమలు, హర్ ఘర్ నల్ జల్ లక్ష్యాల సాధన, రాష్ట్రాల పనితీరు వంటి అంశాలపై ప్రధాని సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేసి, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరందించే లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయడంపై ప్రధాని దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఈ రెండు రోజుల సమావేశం అత్యంత కీలకంగా మారనుంది. రాష్ట్రాల నుంచి వచ్చే సూచనలు, సమస్యలను పరిగణనలోకి తీసుకుని ‘జల్ జీవన్ మిషH’Ž అమలుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
