గోల్కొండ లో బోనాలు.. బోనాల సందర్భంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
* బోనాలతో తరలివచ్చిన మహిళలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హైదరాబాద్ (Hyderabad) లోని గోల్కొండ (Golconda).. కొద్ది రోజులుగా ఆధ్మాత్మిక వైభవంతో విలసిల్లుతోంది. బోనాల నేపథ్యంలో ఎక్కడ చూసినా భక్తజనం కనిపిస్తున్నారు. శ్రీ జగదాంబ మహాకాళి అమ్మవారిని దర్శంచుకునేందుకు తరలి వస్తున్నారు. ఆదివారం కావడంతో కొండ భక్తులతో కిక్కిరిసింది. బోనాలతో మహిళలు తరలివస్తున్నారు. అమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. బోనాల సందర్భంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఈనెల 14న ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) అమల్లో ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ (Traffic Additional CP Vishwaprasad) పేర్కొన్నారు. ఈనెల 14, 18, 21, 25, 28, ఆగస్టు-1, 4 తేదీల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయన్నారు.
—————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
