తెలంగాణ అడ్వకేట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కనకం రమేష్
* రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: తెలంగాణ అడ్వకేట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లుకు చెందిన కనకం రమేష్ (Kanakam Ramesh) ఎన్నికయ్యారు. రంగారెడ్డి కోర్టులో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
స్టేషన్ ఘన్పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కనకం రమేష్ (Kanakam Ramesh) తెలంగాణ అడ్వకేట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించిన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాద మిత్రులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
* న్యాయవాదులకు హెల్త్ కార్డుల కోసం కృషి
రాష్ట్రంలోని అనేక మంది న్యాయవాదులకు ఇప్పటికీ హెల్త్ కార్డులు అందుబాటులో లేవని కనకం రమేష్ తెలిపారు. న్యాయవాదులందరికీ ఆరోగ్య భద్రత కల్పించేలా హెల్త్ కార్డులు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
* న్యాయవాదుల సమస్యలపై పోరాటం
న్యాయవాదుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు. 41 సీఆర్పీసీ (CrPC)కి సంబంధించిన అంశాలు, అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టం, న్యాయవాదులపై జరుగుతున్న దాడుల నివారణ వంటి సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని కనకం రమేష్ స్పష్టం చేశారు.
Read Also : పెట్టుబడుల పండుగకు తెలంగాణ రెడీ!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

