ఆకేరు న్యూస్ హైదరాబాద్ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిరుద్యోగులనుద్దేశించి అడ్డ గోలుగా మాట్లాడితే సహించేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైద్రాబాద్ లో మీడియాతో మాటాడుతూ ముఖ్యమంత్రి స్థాయి దిగజారి, దివాళకోరుతనంతో మాట్లాడారన్నారు .నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న మోతీలాల్ ని అవమానించేలా సీఎం మాట్లాడారు. గతం లో అశోక్ నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకున్న రేవంత్ రెడ్డి అదే కోచింగ్ సెంటర్లను, వారిని అవమానించేలా మాట్లాడుతున్నారు.అందుకే ఈరోజు తెలంగాణ యువత భగ్గుమంటుంది
..మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిన అదే యువత ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. 8 నెలల్లో ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ ఇయ్యని మీరు మిగిలిన నాలుగు నెలల్లో ఏవిధంగా రెండు లక్షల నోటిఫికేషన్లు ఇస్తారో చెప్పాలి.
మిమ్మల్ని వదిలిపెట్టము. ప్రజా క్షేత్రంలో నిలదీస్తాం విద్యార్థులతో నిరుద్యోగులతో కలిసి కొట్లాడుతాం. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు… లక్షలాదిమంది యువతకు సంబందించిన అంశం. రేవంత్ రెడ్డి బేషజాలకు పోకుండా నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ హితవు పలికారు..
———————-