Palnadu Brothers Suicide Case
* కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చిన కుమారులు
* కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్య
ఆకేరు న్యూస్, ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా క్రోసూరు మండలం 88 తాళ్లూరు గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా.. లంకోటి ఆదిలక్ష్మి, రత్తయ్య దంపతుల ఇద్దరు కుమారులు లంకోటి కోటేశ్వరరావు (29), లంకోటి సీతారామయ్య (27) ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరికి వివాహమైంది. సోమవారం రాత్రి కూరగాయల కోసం వెళ్లి ఇంటికి ఆలస్యంగా వచ్చారు. పైగా మద్యం తాగి వచ్చారు. దీంతో వారిపై తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు కుమారులు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రిలో కోటేశ్వర్రావు, గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో సీతారామయ్య చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఒకే ఇద్దరు ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబం కంటికిధారగా విలపిస్తున్నారు. క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబానికి క్షోభను మిగిల్చింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రవిబాబు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
