Six Year Old Boy Aditya Kumar Patna Protest
* న్యాయం జరిగేలా చూస్తానని ఎంపీ పప్పుయాదవ్ హామీ
అకేరు న్యూస్, డెస్క్ : ఆరేళ్ల పిల్లవాడిని పదుల సంఖ్యలో ఉన్న పోలీసులు తీసుకెళ్తున్న వీడియో ఇటీవల వైరలైన విషయం తెలిసిందే. పోలీసుల తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ పిల్లవాడు తన తల్లిదండ్రులను కొట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ధర్నాకు దిగాడు. బాలుడి ధర్నా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
* దీనికి సంబంధించిన వివరాలు ఇలా..
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగిత, ఉపాధ్యాయ నియామక పరీక్షల విధానంలో మార్పులను నిరసిస్తూ అభ్యర్థులు పట్నాలోని డాక్ బంగ్లా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. మొదటి తరగతి చదువుతున్న ఆదిత్య కుమార్ తన తల్లిదండ్రులతో కలిసి ఈ నిరసనలో పాల్గొన్నాడు. మైక్ పట్టుకుని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, విద్యా వ్యవస్థలో మార్పుల కోసం ఈ చిన్నారి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరýయ్యాయి. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. తనను పోలీస్స్టేషన్లో దాదాపు 8 గంటల పాటు ఉంచారని, ఆ సమయంలో తన తల్లిదండ్రులను పోలీసులు కొట్టారని ఆదిత్య ఆరోపించాడు. చిన్నారి భద్రతను దృష్టిలో ఉంచుకుని మాత్రమే పిల్లవాడిని తమ వద్ద ఉంచుకున్నామని, అనంతరం గృహ కార్మికురాలిగా పని చేస్తున్న అతడి తల్లికి అప్పగించామని పోలీసుల వివరణ ఇచ్చారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ ఆదిత్య కుమార్ పట్నాలోని గార్డెనీబాగ్ వద్ద ధర్నా ప్రారంభించాడు. తన తల్లిదండ్రులపై దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని స్పష్టం చేశాడు.
కాగా, గార్డెనీబాగ్ వద్ద ఆదిత్య చేపట్టిన ధర్నా స్థలికి స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ చేరుకుని మాట్లాడారు. బాధిత కుటుంబానికి, బాలుడికి న్యాయం జరిగేలా తాను స్వయంగా బిహార్ ప్రభుత్వం, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఆదిత్య తన నిరసనను విరమించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
