Rajaiah Congress Government Criticism
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయని చేతగాని ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, రాష్ట్ర నాయకులు నాగూర్ల వెంకన్న కాంగ్రెస్ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ 1000 రోజుల మోసాలపై బిఆర్ఎస్ రణభేరి కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్
నియోజకవర్గ కేంద్రం బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ లో బుధవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గదేనేక్కడానికి అలవిగాని హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని వారు ఎద్దేవా చేశారు. 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది అన్నారు.
పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిపిన కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కి పోలిక లేదన్నారు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత కేసిఆర్ కు దక్కుతుంది ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి ఎప్పుడు వస్తుందా కేసీఆర్ ముఖ్యమంత్రి ఎప్పుడూ అవుతాడా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.
గోదావరి నీటిని తన గురువు చంద్రబాబునాయుడుకు దోచి పెడుతున్న రేవంత్ రెడ్డి కాలేశ్వరం నుండి నీటిని తరలించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
బీరు, బ్రాడీలు షాపుల్లో దొరికితే, యూరియా బస్తాలు అప్ లలో బుక్ చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆరోపించారు. ధర్నా కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
