Uppal BRS Congress Clash
* కాంగ్రెస్ పాలన వెయ్యి రోజుల పూర్తిపై ఉప్పల్‌లో ఉద్రిక్తత
ఆకేరు న్యూస్, కమలాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో విఫలమైందంటూ హుజురాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ఉప్పల్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం గ్రామానికి చేరుకున్న వారు, బుధవారం మధ్యాహ్నం స్థానిక గ్రామపంచాయతీ భవనం ఎదురుగా రోడ్డు డివైడర్‌కు సుమారు 50 మీటర్ల పొడవున్న భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీఆర్ఎస్ నాయకులు గ్రామపంచాయతీ ఈవోను కాంగ్రెస్ పార్టీ హామీలపై నిలదీయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న కమలాపూర్ సీఐ నవీన్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం గ్రామపంచాయతీ సిబ్బందితో ఆ భారీ ఫ్లెక్సీని తొలగించారు.
దీనికి ప్రతిగా కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా వద్దకు చేరుకున్న మండల కాంగ్రెస్ నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీతో డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాట మాట పెరిగి నాయకుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఘనంగా స్థలానికి చేరుకొని మొదటి నుంచి శాంతింప చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు బుధవారం అంగడి కావడంతో గ్రామస్తులు భారీ ఎత్తున గుమిగూడారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
