YSR Death Anniversary Mulugu
ఆకేరు న్యూస్, ములుగు : ములుగు జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలతో పాటు ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వర్గీయ డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ములుగు క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి సీతక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆమె మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన తెలుగు రాష్ట్రాల చరిత్రలో ‘సంక్షేమ స్వర్ణయుగం ‘ గా నిలిచిపోయిందని, 2004 నుండి 2009 వరకు సాగించిన సంక్షేమ పాలన,పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ప్రవేశపెట్టిన విప్లమాత్మక పథకాలు కోట్ల మంది జీవితాలను మార్చేశాయని సేవలను కొనియాడారు ఆయన సేవలను కొనియాడారు.ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ,రైతుల కోసం ఉచిత విద్యుత్,రుణమాఫీ,ఫీజు రీయింబర్స్ మెంట్,108,104 వంటి అత్యవసర సేవలు,ఇందిరమ్మ ఇళ్లు,మహిళలకు పావలా వడ్డీ రుణాలు,2 రూపాయలకే బియ్యం, వృద్యాప్త పింఛన్లు,వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి చిరస్థాయిలో నిలిచారని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, పంచాయతీ రాజ్ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి,రాష్ట్ర నాయకులు,జిల్లా సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, చైర్మన్లు డైరెక్టర్లు, అనుబంధ సంఘాల నాయకులు, యూత్ నాయకులు,మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
* కోయగూడెంలో పీపుల్స్ చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల ప్రారంభించిన మంత్రి సీతక్క
గోవిందరావుపేట మండలం కోయగూడెంలో పీపుల్స్ చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన పాఠశాలను మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంబించారు
ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో పేద విద్యార్ధుల కోసం పీపుల్స్ చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ వారు చేస్తున్న సేవలను మంత్రి సీతక్క అభినందించారు. పాఠశాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని వారు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేసి మంచి గుర్తింపు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
