YSR Death Anniversary Thorrur
* తొర్రూరులో వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు
ఆకేరు న్యూస్,తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, నిరుపేదల పెన్నిధి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ నాయకులు మాట్లాడుతూ.. పాలనలో తనదైన ముద్ర వేసి, సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న మహానాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పక్కా గృహాల వంటి విప్లవాత్మక పథకాలతో కోట్లాది మంది ప్రజల జీవితాల్లో ఆయన వెలుగులు నింపారని గుర్తుచేసుకున్నారు.
స్థానిక ఎమ్మెల్యే పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి, సూచనలు, ఆదేశాల మేరకు తొర్రూరు మండలంలో ఈ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు విజయవంతంగా నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ సాగించిన ప్రజాపాలనను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తోందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల బాధ్యులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
