Mirzapur The Movie Advance Bookings
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ‘మిర్జాపూర్: ది మూవీ’ విడుదలకు సమయం దగ్గరపడుతోంది. మూడు విజయవంతమైన సీజన్ల తర్వాత ప్రముఖ క్రైమ్ ఫ్రాంచైజీ ఇప్పుడు తొలిసారి వెండితెరపైకి వస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో కలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్డు పండిట్‌గా అలీ ఫజల్, మున్నా త్రిపాఠిగా దివ్యేందు సహా పలువురు సుపరిచిత నటులు తిరిగి తమ పాత్రల్లో కనిపించనున్నారు.విడుదలకు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. భారతదేశవ్యాప్తంగా తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.3.96 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ఇప్పటివరకు 1,40,295 టికెట్లు అమ్ముడయ్యాయి. మొత్తం 7,555 షోలు బుకింగ్స్ కోసం అందుబాటులో ఉన్నాయి.
* హిందీ వెర్షన్‌దే హవా
అడ్వాన్స్ బుకింగ్స్‌లో హిందీ వెర్షన్ ప్రధానంగా వసూళ్లను రాబడుతోంది. హిందీ వెర్షన్ ద్వారా ఇప్పటివరకు రూ.3.95 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. మొత్తం 7,510 షోల ద్వారా 1,39,923 టికెట్లు అమ్ముడయ్యాయి. హిందీ వెర్షన్ సగటు టికెట్ ధర సుమారు రూ.243గా ఉంది.ఇక తెలుగు వెర్షన్ ఇప్పటివరకు రూ.67,488 గ్రాస్ వసూలు సాధించింది. 45 షోల ద్వారా 372 టికెట్లు అమ్ముడయ్యాయి. తెలుగు వెర్షన్ సగటు టికెట్ ధర సుమారు రూ.154గా ఉంది.
* బ్లాక్ చేసిన సీట్లతో రూ.6 కోట్లకు పైగా
బ్లాక్ చేసిన సీట్లను కూడా లెక్కలోకి తీసుకుంటే సినిమా అడ్వాన్స్ బుకింగ్ గణాంకాలు మరింత పెరుగుతున్నాయి. ఈ లెక్కన మొత్తం బుకింగ్స్ విలువ సుమారు రూ.6.23 కోట్లకు చేరుతోంది.‘మిర్జాపూర్’ సిరీస్ 2018లో ప్రారంభమై ఇప్పటివరకు మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. మూడో సీజన్ 2024లో విడుదలైంది. మూడు సీజన్లు ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
