Gorre Komuraiah Retirement Felicitation
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : స్టేషన్ ఘన్ పూర్ మండల విద్యాశాఖాధికారి గొర్రె కొమురయ్య విద్యారంగం అభివృద్ధి కోసం చేసిన కృషి అభినందనీయం అని జిల్లా ఉపాధ్యాయ సంఘాల నాయకులు కొనియాడారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి చాగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారి గొర్రె కొమురయ్య ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ అభినందన సభ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ మెరుగైన సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సేవలు ఎంతో అవసరం అని, అలాంటి కోవలోకే కొమురయ్య వస్తారని అన్నారు. కొమురయ్య సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా, స్కూల్ అసిస్టెంట్ గా, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా, మండల విద్యాశాఖాధికారి విశేష సేవలు అందించారని కొనియాడారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ ఛాగల్ ఉన్నత పాఠశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారన్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి దాతల సహకారం కృషి చేసారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి.చంద్రశేఖర్ రావు, పిఆర్ టియు టిఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు కె. మహిపాల్ రెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.చంద్రభాను, టి.రవికుమార్, జనగామ జిల్లా డిసిఇబి సెక్రటరీ బి.రఘుజీ, యుటిఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకొపప్పుల రాజు, ముడిదె రాము, పి ఆర్ టి యు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి. ప్రమోద్ రెడ్డి, వి. రఘు, టిపిటిఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై. శ్రీనివాస్, జి.శ్రీనివాస్, డిటిఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి. సోమనారాయణ, ఎ.సోమరాజు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు యం.సంపత్, శోభారాణి రాజహన్మంతారెడ్డి పాఠశాల ఎఫ్ఎసి ప్రధానోపాధ్యాయులు ఎ.అంజిరెడ్డి, ఎం ఆర్ సి సిబ్బంది పాల్గొన్నారు.
“ట్రస్మా డివిజన్ అధ్యక్షులు ఉబ్బని మల్లేశం, కోశాధికారి అధికారి బెన్ని జార్జ్, జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ్ కుమార్, జిల్లా మాజీ కోశాధికారి కొండయ్య సభ్యులు టోమీ జోసఫ్, ఫాదర్ కిరణ్, ఫాదర్ సీజు, పిట్టల రాజు, సరళ అరుణాచలం, శివ, రాము, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
