Minister Seethakka 1000 Days Victory Rally
ఆకేరు న్యూస్,ములుగు : ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ములుగు జిల్లా ఏటూరునాగారంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో గురువారం ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా భారీ సంఖ్యలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.
ఏటూరునాగారం ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, పేదలు, కార్మికులు, ఆదివాసీలు, గిరిజనులు సహా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు వివరించారు.
గత వెయ్యి రోజుల్లో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి సీతక్క ప్రజలకు వివరించారు.
వర్షంలోనూ భారీ సంఖ్యలో పాల్గొని విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేసిన ఏటూరునాగారం ప్రజలకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూర్ నాగారం మండలం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
