Krishnashtami Celebrations at Sri Bugulu Venkateshwara Swamy Temple
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకమ, శ్రీకృష్ణ అవతార అలంకరణ, బాలభోగం నివేదన, శత సహస్ర (లక్ష) పుష్పార్చన, స్వామివారికి రాజభోగం నివేదన, శ్రీకృష్ణ పెరుమాళ్ ఊయల సేవ, విష్ణు సహస్రనామ పారాయణం , కృష్ణాష్టకం, తనియ విన్నపం, ద్వాదశ (12 రకాల ప్రసాదాలు) ఆరాధన, మంగళాశాసనం, పవళింపు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం భక్తుల మహాత్భాగ్యం అన్నారు. తెలంగాణలో రెండవ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భక్తులు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.
* “స్వామి వారిని దర్శించుకున్న పరకాల ఆర్డిఓ”
కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ అవతారంలో దర్శనమిచ్చిన శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామిని పరకాల ఆర్డిఓ డిఎస్. వెంకన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ శ్రీధర్ రావు తో పాటు పూజారులు శ్రీరంగాచార్యులు, రవీంద్ర శర్మ, లక్ష్మణాచార్యులు, కృష్ణమాచార్యులు ధర్మకర్తలు రత్నాకర్ రెడ్డి, రాజశేఖర్ ఆలయ సిబ్బంది వివిధ గ్రామాలనుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
