Kamal Haasan New Movie First Look
* కమల్ హాసన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్..
* చేతిలో భారీ ఆయుధం
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సేతుపతి’, ‘చిత్తా’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఎస్.యు. అరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
* పవర్ఫుల్ లుక్‌తో కమల్ హాసన్
సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆసక్తిని పెంచుతోంది. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, గడ్డంతో కనిపిస్తున్న కమల్ హాసన్.. బ్లాక్ షర్ట్, ఆలివ్ గ్రీన్ ట్రౌజర్స్‌లో కనిపించారు. చేతిలో భారీ ఆయుధంతో నడుస్తున్న ఆయన లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. కూల్‌గా కనిపిస్తూనే ఇంటెన్స్‌గా ఉన్న ఈ లుక్.. సినిమాలో కమల్ హాసన్ పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా చేతిలోని ఆయుధం ఆయన క్యారెక్టర్‌పై మరిన్ని అంచనాలను పెంచుతోంది.
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా లుక్ టెస్ట్‌ను ఇటీవల నిర్వహించారు. లుక్ టెస్ట్‌కు సంబంధించిన కొన్ని గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎస్.యు. అరుణ్ కుమార్ బలమైన పాత్రలను ఆసక్తికరమైన కథనంతో మిళితం చేయడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కమల్ హాసన్‌తో ఆయన కలయిక ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తిని పెంచుతోంది.
లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తవడంతో సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. సినిమాకు సంబంధించిన కథ, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.
தோ வாரேன் 🔥@ikamalhaasan #SUArunkumar#KamalHaasan #Mahendran@RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/1GMUOdcSH6
— Raaj Kamal Films International (@RKFI) September 3, 2026

Please tell us what is wrong. Your report will be sent to the website team.
