Dil Chahta Hai Reunion
* సినిమా 25వ వార్షికోత్సవం సందర్భంగా రీయూనియన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో 2001లో తెరకెక్కిన ‘దిల్ చాహ్తా హై’ ఇటీవల 25 ఏళ్లను పూర్తి చేసుకుంది. అమీర్ ఖాన్, అక్షయ్ ఖన్నా, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది. సినిమా 25వ వార్షికోత్సవం సందర్భంగా చిత్ర నిర్మాతలు, నటీనటులు, కొంతమంది సాంకేతిక సిబ్బంది రీయూనియన్‌లో పాల్గొన్నారు. యువాతో జరిగిన ఈ ప్రత్యేక సంభాషణలో సినిమా షూటింగ్‌కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అక్షయ్ ఖన్నా.. అమీర్ ఖాన్‌ను ఓ కీలక సన్నివేశం కోసం 17 సార్లు చెంపదెబ్బ కొట్టిన విషయం బయటకు వచ్చింది.
* అమీర్ ఖాన్ ముఖం వాచిపోయింది
సినిమాలోని ఇంటర్వెల్ సీన్ షూటింగ్ గురించి ఫర్హాన్ అక్తర్ వివరించారు. సినిమాలో సిద్ పాత్రలో నటించిన అక్షయ్ ఖన్నా.. ఆకాశ్ పాత్రలో నటించిన అమీర్ ఖాన్‌ను ఓ ఉద్విగ్న సన్నివేశంలో చెంపదెబ్బ కొట్టాల్సి ఉంటుంది.అక్షయ్ తన డైలాగ్ పూర్తిచేసిన తర్వాత అమీర్‌ను కొట్టేలా తొలుత సీన్‌ను ప్లాన్ చేశారు. అయితే సన్నివేశంలో అనూహ్యమైన ట్విస్ట్ తీసుకురావాలని భావించిన ఫర్హాన్.. అక్షయ్ డైలాగ్ చెబుతున్న సమయంలోనే అమీర్‌ను చెంపదెబ్బ కొట్టాలని సూచించారు. అనుకున్నట్లుగానే సీన్‌ను చిత్రీకరించారు.
ఈ విషయాన్ని గుర్తుచేసుకున్న ఫర్హాన్ అక్తర్ మాట్లాడుతూ.. అమీర్ ఎంతో సహకరించారని చెప్పారు.“అమీర్ చాలా స్పోర్టివ్‌గా తీసుకున్నారు. ఈ సీన్ వల్ల నేను పాత్రకు సంబంధించిన భావోద్వేగ స్థితిలోకి వెళ్లగలుగుతున్నాను కాబట్టి అలాగే చేయనివ్వండి అన్నారు. మళ్లీ మళ్లీ చెంపదెబ్బ కొట్టాలని ఆయనే పట్టుబట్టారు. చివరకు అమీర్‌ను 17 సార్లు కొట్టాల్సి వచ్చింది” అని ఫర్హాన్ తెలిపారు.
* ముఖంపై వాపు
ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ కూడా ఈ సన్నివేశం గురించి మాట్లాడారు. కెమెరా యాంగిల్స్, భావోద్వేగాలు, సన్నివేశంలోని తీవ్రత.. ఇవన్నీ కలిసి ఆ సీన్‌ను మరింత ప్రభావవంతంగా మార్చాయని ఆయన చెప్పారు.అయితే షూటింగ్ పూర్తయ్యే సమయానికి అమీర్ ఖాన్ ముఖం ఒక వైపు బాగా వాచిపోయిందని, చెంపలపై చెంపదెబ్బల గుర్తులు కూడా కనిపించాయని ఫర్హాన్ అక్తర్ గుర్తుచేసుకున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
