Mulugu Teachers Day Celebrations
ఆకేరు న్యూస్, ములుగు:
మండల వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత ,ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శనివారం గురుపూజోత్సవ వేడుకలను విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జడ్పిహెచ్ఎస్ ఇందిరానగర్, పిఎస్ ఇందిరానగర్ , ఆశ్రమ పాఠశాల తాడ్వాయి ,కోడి శాల, నార్లాపూర్ మేడారం, ఊరటం, కాటాపూర్, బీరెల్లి తదితర పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించి ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ దినోత్సవం ప్రాముఖ్యత పై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తాడ్వాయి మండల కేంద్రంలో జరిగిన వేడుకలలో మండల విద్యాశాఖ అధికారి గడ్డి శ్రీనివాస్, విశ్రాంత మాజీ మండల విద్యాశాఖ అధికారి రేగ కేశవరావు,కాంప్లెక్స్ ఉపాధ్యాయురాలు రేణుక ,ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు సోలం కృష్ణయ్య, లతోపాటు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొని ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
