Konda Surekha Assembly Absence
* బర్తరఫ్ తర్వాత తొలిసారి సమావేశాలు
* కాంగ్రెస్‌లోనే ఉంటా.. కానీ అసెంబ్లీకి రాను
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన వేళ రాష్ట్ర రాజకీయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన పూర్వ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మంత్రి పదవి నుంచి తొలగించిన అనంతరం జరుగుతున్న మొదటి అసెంబ్లీ సెషన్ ఇది. అయితే ఈరోజు సభ ప్రారంభమైనా కొండా సురేఖ హాజరుకాలేదు.దీంతో రాజకీయా వర్గాల్లో అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధిష్ఠానం, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె, ఈ అసెంబ్లీ సెషన్ మొత్తం సభకు రాకూడదని భావిస్తున్నట్లు సమాచారం.
మంత్రి పదవి పోయినా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యేగా కొనసాగుతానని కొండా సురేఖ స్పష్టం చేశారు. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో సభకు వెళ్తే ఎదురయ్యే ప్రశ్నలు, పొలిటికల్ హీట్‌ను నివారించేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొండా సురేఖ దూరంగా ఉండటం కాంగ్రెస్ వర్గాల్లోనూ, అలాగే వరంగల్ జిల్లా రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
