Warangal Akhila Suicide Case
* మృతి చెందిన అఖిల
* వరంగల్ జిల్లాలో విషాదం
ఆకేరు న్యూస్, వరంగల్ : మనస్పర్థలు అసువులు తీస్తున్నాయి. నేటి సమస్య రేపటికి గతం.. గత గాయాలు గుర్తుకు రానే మరుపు. క్షణికావేశంలో బంగారు భవిష్యత్, విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వైవాహిక జీవితంలో వచ్చిన అభిప్రాయ భేదాలతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నెక్కొండ మండలం, బొల్లికొండ గ్రామానికి చెందిన వివాహిత అఖిల (24) కొన్ని రోజులుగా కుటుంబంలో తలెత్తిన కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది 5 రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 5 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం పరిస్థితి విషమించి అఖిల మృతి చెందింది.
చిన్న వయస్సులోనే అఖిల మృతి చెందడంతో బొల్లికొండ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
