Minister Nadendla Manohar NCCF Meeting
* రైతులకు మద్దతు ధర కల్పించాలి
* ఢిల్లీలో ఎన్సీసీఎఫ్ ఎండీ తో నాదెండ్ల భేటీ
ఆకేరు న్యూస్, ఢిల్లీ : మార్కెట్లో నిత్యావసర సరుకుల లభ్యతను పెంచాలని ఎన్సీసీఎఫ్ ఎండీని మంత్రి నాదెండ్ల కోరారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌తో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
* ప్రత్యేక కేటాయింపులు చేయాలి…
రాష్ట్రంలో కందిపప్పు, బియ్యం, ఉల్లిపాయలు వంటి నిత్యావసర వస్తువులను కొరత లేకుండా ప్రజలకు సరసమైన ధరలకే అందించేందుకు ఎన్సీసీఎఫ్ ద్వారా ప్రత్యేక కేటాయింపులు చేయాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో గిడ్డంగుల (గోడౌన్లు) సామర్థ్యాన్ని పెంచడం, రైతులకు మద్దతు ధర కల్పిస్తూ వారి నుంచి నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడంలో కేంద్ర ఏజెన్సీలు భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు.
* చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా..
వినియోగదారులకు నాణ్యమైన సరుకులను వేగవంతంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్సీసీఎఫ్ పూర్తి సహకారం అందిస్తాయని ఎండీ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ధరల స్థిరీకరణ నిధి సాయంతో బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరగకుండా నిరంతరం నిఘా ఉంచుతామని, సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
