BRS Tadwai Protest
ఆకేరు న్యూస్, ములుగు: బీఆర్ఎస్ పార్టీ సభ్యులను అసెంబ్లీ కి హాజరు కాకుండా ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఖండిస్తూ
సోమవారం తాడ్వాయి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు నిరసన చేశారు. తాడ్వాయి మండల అధ్యక్షుడు దండగుల మల్లయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని నిరసన కార్యక్రమాన్ని విరమింప చేశారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దిడ్డి మోహన్ రావు, మాజీ ఎంపిటిసిలు రాజమౌళి, దానక నర్సింగరావు, మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ హుస్సేన్ (వహీద్) సీనియర్ నాయకులు పిన్నింటి యాదిరెడ్డి, పత్తి గోపాల్ రెడ్డి, మండల సోషల్ మీడియా ఇన్ చార్జ్ బందెల తిరుపతి, రఫిక్, ప్రధాన కార్యదర్శి పోగు నాగేష్ ,శివరాజ్ , యూత్ నాయకుడు తడక సాయి, ఎల్పీ వెంకటేష్, సతీష్ చారి, లక్ష్మీ సమ్మయ్య,బాబూరావు, ప్రణయ్, ప్రసాద్ ,మహేష్, సూరి,రాహుల్, నాగరాజు అల్ల వెంకటేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
