Mulugu Congress leaders protest
* తాత మధు వ్యాఖ్యలను నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం
ఆకేరు న్యూస్, ములుగు :
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తూ గోవిందరావుపేట మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో తాత మధు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పాలడుగు వెంకటకృష్ణ మాట్లాడుతూ.. దళిత సామాజిక వర్గానికి చెందిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ను కించపరిచే విధంగా మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని మండిపడ్డారు.
* కావాలనే బీఆర్ఎస్ హంగామా..
కేటీఆర్, హరీశ్రావులతోపాటు ఆపార్టీ ఎమ్మెల్యేలు కావాలనే నల్ల టీ-షర్టులు ధరించి శాసనసభ పరిసరాల్లో హంగామా చేసి పోలీసులతో ఘర్షణకు దిగేలా వ్యవహరించడం అత్యంత శోచనీయమని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వేదికను రాజకీయ రచ్చకు వేదికగా మార్చడం తగదని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీకి వచ్చి చర్చించకుండా బయట రోడ్లపై హంగామా చేయడం ఎందుకని ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చించి తమ ఆరోపణలను నిరూపించుకునే ధైర్యం లేకనే బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై ర్యాలీలు, నిరసనలు, రాజకీయ హంగామా చేస్తున్నారని విమర్శించారు. వారి వ్యవహార శైలిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పాలడుగు వెంకటకృష్ణ అన్నారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కార్మిక శాఖ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, సీనియర్ నాయకులు కనతల నాగేందర్ రావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారామ్ నాయక్, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు చింత క్రాంతి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు భైరి అభిలాష్, మాజీ ఎంపీటీసీలు చాపల ఉమాదేవి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
