TPCC Chief Mahesh Kumar Goud
* క్లారిటీ ఇచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
ఆకేరు న్యూస్,హైదరాబాద్ :
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై షాద్‌నగర్ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ స్పందించారు. ఎవరి చావును తాము కోరుకోమని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై షాద్‌నగర్ ఎమ్మెల్యే అలా మాట్లాడకుండా ఉండాల్సిందని టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినప్పటికీ.. వ్యక్తిగతంగా ఎవరినీ కించపరిచేలా, వారి మరణాన్ని కోరుకునేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
* వ్యక్తిగత ద్వేషాలకు తాము దూరం..
“మేం ఎవరి చావు కోరుకోం. అందరం బాగుండాలని కోరుకుంటాం.. కేసీఆర్‌పై షాద్‌నగర్ ఎమ్మెల్యే అలా మాట్లాడకుండా ఉండాల్సింది” అని మహేష్‌గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇదేనని, వ్యక్తిగత ద్వేషాలకు తాము దూరంగా ఉంటామని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
