Pulla Karunakar IPS
* ఐపీఎస్‌గా పదోన్నతిపై సత్కారం
* హాజరైన వొడితల ప్రణవ్
ఆకేరు న్యూస్, కమలాపూర్:
కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన పుల్ల కరుణాకర్ ఇటీవల ఐపీఎస్‌గా పదోన్నతి పొందడం పై గ్రామస్తులు, మండల ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వగ్రామమైన ఉప్పల్ లో ఏర్పాటు చేసిన అభినందన సభకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఐపీఎస్ అధికారి పుల్లా కరుణాకర్ ను శాలువా కప్పి, ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో ఆయన మరిన్ని అత్యున్నత పదవులు అధిష్టించాలని వొడితల ప్రణవ్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, వైస్ చైర్ పర్సన్ అంజలి, ఉప్పల్ గ్రామ సర్పంచ్ రమ-నాగరాజు, వివిధ మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ఐపీఎస్ అధికారికి అభినందనలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
