Mulugu BRS leaders
* ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై బీఆర్ఎస్ నేతల డిమాండ్
ఆకేరు న్యూస్, ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం చేస్తామని మాజీ జడ్పిటీసి రామసహాయం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ హయాంలో సుభిక్షంగా ఉన్న ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. మహిళలకు రూ.2500, వృద్ధులకు రూ. 4000, దివ్యాంగులకు రూ. 6000 పెన్షన్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, కౌలు రైతులకు రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగ భృతి పథకాలను అమలు చేయలేదని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల పోరం ములుగు జిల్లా జేఏసీ అధ్యక్షుడు దిడ్డి మోహన్ రావు, మండల ప్రధాన కార్యదర్శి పోగు నగేష్, నాయకులు పిన్నింటి యాదిరెడ్డీ, గున్ను రెడ్డి,ఎల్లబోయిన రాకేష్, ఠాకూర్ సురేందర్,శివరాజ్, పత్తి గోపాల్ రెడ్డి, ఏండి రఫిక్ మొక్క భాస్కర్, సతీష్ చారీ, ప్రసాద్ సూరి, నుశెట్టి రాము, వహీద్,లక్ష్మి సమ్మయ్య, పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
