Nerella Irrigation Crisis
* నేరెళ్లలో తీవ్ర రూపం దాల్చుతున్న సాగునీటి సంక్షోభం
* ప్రభుత్వానికి రైతుల వేడుకోలు
ఆకేరు న్యూస్, కమలాపూర్: కమలాపూర్ మండలంలోని నేరెళ్ల గ్రామానికి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని అక్కడి రైతులు బుధవారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎస్సారెస్పీ నుండి కాకతీయ కాలువకు నీటి విడుదల నిలిచిపోవడంతో సాగునీటి కోసం ఆ గ్రామ రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి వరి నాట్లు కళ్ళముందే ఎండిపోతున్నాయని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా కురిసిన వర్షాలను నమ్ముకుని అప్పులు చేసి నాట్లు వేశామని, ఇప్పుడు నీరు అందకపోతే తీరని నష్టం వాటిల్లి దిక్కుతోచని స్థితిలో పడతామని రైతులు వాపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎస్సారెస్పీ నుండి నీటిని విడుదల చేసి, కనీసం ఈ వానాకాలం పంట వరకైనా సాగునీరు అందించి ఆదుకోవాలని శ్రీకాంత్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు గోల్కొండ శ్రీకాంత్, చల్ల రవీందర్, గోల్కొండ లక్ష్మీపతి, ఆకుల రమేష్, నాయకం రఘుపతి, నాయకం రాకేష్, కొండం రాజయ్య, గోల్కొండ కుమారస్వామి, కోడూరి అజయ్, కొండం శంకర్, శివరాత్రి శ్రీనివాస్, కోడెపాక అన్వేష్ పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
