Konda Surekha and Konda Murali
* అనంతరం ఢిల్లీకి వెళ్లే అవకాశం
ఆకేరు న్యూస్, వరంగల్: మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ నివాసంలో రేపు ఉదయం కీలక సమావేశం జరగనుంది. ఉదయం 9 గంటలకు ముఖ్య కార్యకర్తలతో నిర్వహించనున్న ఈ సమావేశంలో కొండా సురేఖతో పాటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పాల్గొననున్నారు. ముఖ్య కార్యకర్తలందరూ సమావేశానికి తప్పక హాజరుకావాలని కొండా మురళి ఇప్పటికే ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
* కీలక పదవిపై చర్చ జరిగే అవకాశం?
కొండా సురేఖకు త్వరలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని కార్యకర్తలకు కొండా మురళి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. రేపటి సమావేశంలో ఈ విషయంపై కార్యకర్తలతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం, వారి సూచనలు మరియు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని కొండా సురేఖ భావిస్తున్నట్లు సమాచారం.
* సమావేశం తర్వాత ఢిల్లీకి?
కార్యకర్తల సమావేశం ముగిసిన అనంతరం కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇదిలా ఉండగా.. కొండా మురళి ఇప్పటికే వరంగల్‌లోని రామ్‌నగర్ నివాసానికి చేరుకున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి నార్ల సుబ్రహ్మణ్యాన్ని ఆస్పత్రిలో పరామర్శించిన కొండా సురేఖ వరంగల్‌కు బయలుదేరినట్లు సమాచారం. రేపటి సమావేశంలో కొండా దంపతులు కార్యకర్తలకు ఎలాంటి సమాచారం ఇస్తారు? ఢిల్లీ పర్యటనలో ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారా? కొండా సురేఖకు ఏదైనా ముఖ్యమైన పదవి దక్కనుందా? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే పదవి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
