Modi Xi Jinping Meeting
* ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు..
* సరిహద్దు, వాణిజ్య అంశాల ప్రస్తావన
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు కీలకంగా చర్చించినట్లు సమాచారం.
సమావేశంలో ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు అంశం, వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు తదితర కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం, ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడంపై కూడా నేతలు చర్చించినట్లు సమాచారం.
అలాగే, ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు మద్దతుగా నిలిచినందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
