Purnachari SIIMA Award
* సినీ రంగంలో ‘పూర్ణాచారి’ సంచలనం
* కోర్టు’ సినిమా పాటతో మెరిసిన చల్లారి పూర్ణాచారి
* వెల్లువెత్తుతున్న అభినందనలు
ఆకేరు న్యూస్, వరంగల్ : గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి సినీ రంగంలో తనదైన శైలిలో రాణిస్తున్న గేయ రచయిత చల్లారి పూర్ణాచారికి ప్రతిష్టాత్మక సైమా (SIIMA) అవార్డు వరించింది. ములుగు జిల్లా బండారుపల్లి గ్రామానికి చెందిన పూర్ణాచారి, నాని సమర్పణలో వచ్చిన ‘కోర్టు’ చిత్రంలోని ‘కథలెన్నో చెప్పారు’ పాటకు గానూ ఈ అవార్డును అందుకున్నారు.
* గేయ రచయితగా గుర్తింపు..
చల్లారి పూర్ణాచారి సినీ ఇండస్ట్రీలో గేయ రచయితగా అనేక విజయవంతమైన పాటలు రాసి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కోర్టు’ సినిమాలో ఆయన రాసిన ‘కథలెన్నో చెప్పారు’ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. తాజాగా దుబాయ్లో నిర్వహించిన సైమా అవార్డ్స్ వేడుకలో ఈ పాట ప్రతిష్టాత్మక పురస్కారాన్ని దక్కించుకుంది.
* అంతర్జాతీయ వేదికపై పురస్కారం..
తన స్వగ్రామమైన బండారుపల్లి నుంచి చలనచిత్ర పరిశ్రమ స్థాయికి ఎదిగి అంతర్జాతీయ వేదికపై పురస్కారం పొందడం పట్ల ములుగు జిల్లా ప్రజలు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పల్లె వాతావరణం నుండి వచ్చి సినీ రంగంలో జిల్లా పేరు నిలబెట్టిన పూర్ణాచారికి పలువురు ప్రముఖులు మరియు స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
