చైనాను కుదిపేస్తున్న వరదలు
ఆకేరు న్యూస్ డెస్క్ : భారీ వర్షాలు, వరదలు చైనా 9 ను కుదిపేస్తున్నాయి. భయాందోళనలు కలిగిస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వానలకు ఆకస్మికంగా ఓ బ్రిడ్జి కూలి 11 మంది మృతి చెందారు. 30 మంది గల్లంతు అయ్యారు. చైనాలోని జాసుయి కౌంటీలో ఉన్న డానింగ్ ఎక్స్ప్రెస్ వే కూలడంతో అదే సమయంలో బ్రిడ్జి పై నుంచి వెళ్తున్న ఐదు వాహనాలు నదిలో పడ్డాయి. 11 మంది మృతదేహాలను వెలికితీసినట్లు చైనా మీడియా పేర్కొంది. అయితే నదిలో పడ్డ మరో 20 వాహనాల ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ ప్రమాదంపై చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పందించారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం దేశంలో వరద నియంత్రణ సమస్యాత్మకంగా ఉన్నట్లు జిన్పింగ్ తెలిపారు. అయితే స్థానిక ప్రభుత్వాలు బాధ్యతలు తీసుకుని , అన్నింటిని మానిటర్ చేయాలని ఆయన పేర్కొన్నారు. నేషనల్ ఫైర్ అండ్ రెస్క్యూ అథారిటీ.. బ్రిడ్జ్ కూలిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపడుతోంది.
———————