Kishan Reddy Parade Ground Visit
సోనియా కుటుంబపాలన వచ్చే..
– కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్ ( KCR ) కుటుంబపాలన పోయి.. సోనియా ( Sonia Gandhi ) కుటుంబపాలన వచ్చిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి ( Kishan Reddy ) విమర్శించారు. నిరుద్యోగ యువత న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద జరిగిన మహాధర్నాలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్, కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా, నోటిఫికేషన్లు ఇవ్వకుండా యువతను మోసం చేసిందని, కాంగ్రెస్ సర్కారు కూడా అదే పద్ధతిలో నడుస్తోందని విమర్శించారు. జాబ్ క్యాలండర్ ఎక్కడ? గత బీఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, రేవంత్ ( Revanth Reddy ) ప్రభుత్వం కూడా మాట ఇచ్చి తప్పిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘‘2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నరు. ఎక్కడపోయాయి..? జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయారు. ఎన్నికలకు ముందు డేట్, టైంతో సహా ప్రకటించారు. ఇప్పుడేమైందిది. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఏవి..? 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామని చెప్పి మాట తప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కు వెళ్లడం లేదు.. దరఖాస్తులు తీసుకోవడం లేదు. సెక్రటేరియట్ కు కాంగ్రెస్ నాయకులు, పైరవీకారులకు ఎంట్రీ ఉంది. కానీ, నిరుద్యోగ యువకులను వెళ్లనివ్వడం లేదు. అతి తక్కువ కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నవి కర్నాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు”అని కిషన్ రెడ్డి అన్నారు.
————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.

