Rupayanam First Look
* అక్టోబర్ 2న థియేటర్లలోకి..
* పోస్టర్ ఆవిష్కరణ
Rupayanamaha First Look: ఆకేరు న్యూస్, సినిమా: చిత్రవేద ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పావని సాగి నిర్మాణంలో అరవింద్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘రూపాయనమ:’. ఈ సినిమాలో అరవింద్ పాండ్రేట్, వేణు పొల్సాని, డి. అనుదీప్, శ్రావణి మల్కని, క్రాక్ శ్రీమణి, విషాన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
కోటి రూపాయల లాటరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఫ్యామిలీ, కామెడీతో పాటు థ్రిల్లింగ్, సస్పెన్స్ అంశాలను మేళవించారు. ఈ మూవీని అక్టోబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. మొత్తం 2 గంటల 13 నిమిషాల నిడివితో ‘రూపాయనమ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా
‘రూపాయనమ’ మొదటి పోస్టర్, టైటిల్ సాంగ్‌ను దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఈ ప్రమోషనల్ కంటెంట్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఫ్యామిలీ, సస్పెన్స్, హ్యూమర్ అంశాలను కలగలిపి సినిమాను రూపొందించినట్లు పేర్కొంది.
రానున్న రోజుల్లో మరింత ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.
ఈ చిత్రానికి రిషి.ఎం సంగీతం అందించగా, జింక వరుణ్ నాయుడు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. ఎడిటర్‌గా రవితేజ గిరిజాల పనిచేశారు.
నటీనటులు: అరవింద్ పాండ్రేట్, వేణు పొల్సాని, డి. అనుదీప్, శ్రావణి మల్కని, క్రాక్ శ్రీమణి, విషాన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి తదితరులు.
బ్యానర్: చిత్రవేద ప్రొడక్షన్స్
నిర్మాత: పావని సాగి
రచయిత, దర్శకుడు: అరవింద్ రెడ్డి
కెమెరామెన్: జింక వరుణ్ నాయుడు
ఎడిటర్: రవితేజ గిరిజాల
మ్యూజిక్ డైరెక్టర్: రిషి.ఎం

Please tell us what is wrong. Your report will be sent to the website team.
