Thatikonda
* మూడేళ్లకు సరిపడా పనులను గుర్తించాలి
* సర్పంచ్ సుజన శ్రీనివాస్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: వికసిత్ భారత్ పథకం కింద గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను మూడేళ్లకు సరిపడా గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేయాలని తాటికొండ సర్పంచ్ మారపాక సుజన శ్రీనివాస్ అన్నారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో మంగళవారం వికసిత్ భారత్ రోజ్గార్ అజీవిక మిషన్ గ్రామసభ నిర్వహించారు. 2026 నుంచి 2029 వరకు మూడు సంవత్సరాల పాటు గ్రామంలో చేపట్టాల్సిన పనుల ఎంపిక, యాక్షన్ ప్లాన్ తయారీ కోసం ఈ గ్రామసభ నిర్వహించినట్లు సర్పంచ్ తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పరిధిలో మూడేళ్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, వాటికి సంబంధించిన ప్రణాళికలను అధికారులు గ్రామసభలో వివరించారు. గ్రామ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులను గుర్తించి ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ కట్టమల్లు, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, కారోబార్లు, మేట్లు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
