KilleR
KilleR: ఆకేరు న్యూస్, హైదరాబాద్: జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైఫై థ్రిల్లర్ ‘కిల్లర్’ అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి.ఎ నిర్మిస్తున్నారు.
మహిళల కోసం ‘సూపర్ షీ’ ఛాలెంజ్
సినిమా ప్రమోషన్లో భాగంగా ‘కిల్లర్’ టీమ్ మహిళల కోసం ప్రత్యేకంగా ‘సూపర్ షీ ఛాలెంజ్’ ప్రకటించింది. రాత్రికి రాత్రే సూపర్ పవర్ వస్తే ఏం చేస్తారో చెబుతూ రీల్స్ చేసి పంపాలని మేకర్స్ తెలిపారు. బెస్ట్ 10 రీల్స్‌కు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నారు.
అలాగే టెక్స్ట్ మెసేజ్‌లలో బెస్ట్ 20 సమాధానాలకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున ప్రైజ్ అందించనున్నారు. విజేతలకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో బహుమతులు అందజేయనున్నారు.
ఓవర్సీస్లోనూ రిలీజ్
ఓఎంజి పిక్చర్స్ ‘కిల్లర్’ను ఓవర్సీస్లో విడుదల చేస్తోంది. అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా తదితర దేశాల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
