Fatehpur
Fatehpur: ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: తన ఇంటిని కుమారుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ధ్రువీకరణ పత్రం ఇవ్వడంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫతేపూర్ గ్రామానికి చెందిన గుగులోత్ దేవ ఆరోపించారు.
జనగామ జిల్లా చిల్పూర్ మండలం ఫతేపూర్ గ్రామంలో తన పేరు మీద సొంత ఇల్లు ఉందని, దానికి క్రమం తప్పకుండా ఇంటి పన్ను, నల్ల పన్ను చెల్లిస్తున్నట్లు దేవ తెలిపారు. ఇంటిని కుమారుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గ్రామపంచాయతీ నుంచి ధ్రువీకరణ పత్రం కోరినట్లు చెప్పారు.
కొన్ని రోజులుగా పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పత్రం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. గ్రామ ప్రజాప్రతినిధులు స్పందించి ధ్రువీకరణ పత్రం ఇప్పించాలని గుగులోత్ దేవ కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
