Least Eligible Bachelor
* సెప్టెంబర్ 30 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. బాబు డెగాల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 30 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. హర్ష తండ్రి ఎవరినైనా ప్రేమించమని చెప్పే సన్నివేశంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫన్, కామెడీ సన్నివేశాలతో టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు.
హర్ష చెముడు తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా.. హైపర్ ఆది పంచులు టీజర్లో హైలైట్‌గా నిలిచాయి. జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్, శ్రావ్య చౌదరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అజయ్ అరసాడ సంగీతం అందించారు. శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ, లిఖిత్ లీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. చవాన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 30 నుంచి ఈటీవీ విన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
