Sigma
- అక్టోబర్ 2న థియేటర్లలోకి..
- సందీప్ కిషన్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ
Sigma: ఆకేరు న్యూస్, హైదరాబాద్: హీరో సందీప్ కిషన్ నటిస్తున్న క్రేజీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘సిగ్మా’ విడుదలకు సిద్ధమైంది. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్
‘సిగ్మా’ను తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. తెలంగాణ, కోస్తా ఏరియాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ సినిమాను విడుదల చేయనుండగా.. సీడెడ్ ఏరియాలో ఎన్వీఆర్ సినిమా రిలీజ్ చేయనుంది. దీంతో సినిమాకు బలమైన డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ లభించినట్లైంది.
భారీ తారాగణం
సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తున్నారు. రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అన్బు థాసన్, యోగ్ జపే తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా.. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హరిహరసుతన్ విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తున్నారు. యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో తెరకెక్కుతున్న ‘సిగ్మా’ అక్టోబర్ 2న థియేటర్లలో సందడి చేయనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
