Paataku Pranam
Paataku Pranam: ఆకేరు న్యూస్, హైదరాబాద్: హెచ్.టీ సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై తెరకెక్కుతున్న మ్యూజికల్ ఫిల్మ్ ‘పాటకు ప్రాణం’ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. దర్శకుడు హేమల్ తుమ్మపూడి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరో నిఖిల్ క్లాప్ కొట్టగా.. దర్శకుడు సురేందర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ కార్యక్రమానికి సురేందర్ రెడ్డి, నిఖిల్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సుదర్శన్, సాత్విక జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజీవ్ కనకాల, అనితా చౌదరి, రఘు కారుమంచి, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
పాటల చుట్టూ కథ
‘పాటకు ప్రాణం’ స్క్రిప్ట్ చాలా ఛాలెంజింగ్‌గా ఉందని తనికెళ్ల భరణి తెలిపారు. సాధారణంగా కథకు అనుగుణంగా పాటలు ఉంటాయని, అయితే ఈ సినిమాలో కథే పాటల చుట్టూ తిరుగుతుందని చెప్పారు. పాత తరం సంప్రదాయ సంగీత విద్వాంసుడికి, ప్రస్తుత జెన్-జీ సంగీతకారుడికి మధ్య జరిగే ఆసక్తికరమైన కలయికను ఈ చిత్రంలో చూపించనున్నట్లు వివరించారు.
సెప్టెంబర్ 24 నుంచి షూటింగ్
దర్శకుడు హేమల్ తుమ్మపూడి చిన్న వయసులోనే ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని హీరో సుదర్శన్ తెలిపారు. ప్రేక్షకులకు థియేటర్లలో మంచి మ్యూజికల్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో సినిమా రూపొందిస్తున్నట్లు చెప్పారు. దర్శక నిర్మాత హేమల్ తుమ్మపూడి వెల్లడించిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 24 నుంచి ‘పాటకు ప్రాణం’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నిర్మాత శ్రీరామ్ తుమ్మపూడి, డీఓపీ సంజీత్ సింగ్, ఎడిటర్ ప్రభాత్ రెడ్డి తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
