Ba Ba Black Sheep Movie
* Ba Ba Black Sheep Movie రిలీజ్ డేట్ ఫిక్స్
* మేఘాలయాలో పూర్తిగా చిత్రీకరణ..
* అనిల్ రావిపూడి విడుదల చేసిన సెకండ్ సాంగ్
ఆకేరు న్యూస్, సినిమా : న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగా తెరకెక్కుతున్న చిత్రం బా బా బ్లాక్ షీప్ (Ba Ba Black Sheep Movie) . దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియో బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 9న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
* సెకండ్ సాంగ్ రిలీజ్..
ఇప్పటికే విడుదలైన టీజర్, ఆజా మేరీ జాని పాటకు మంచి స్పందన రావడంతో తాజాగా సెకండ్ సాంగ్ వెవెలా ఊహలే చూపినా..ను విడుదల చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ పాటను విడుదల చేసి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
* పాట నేపథ్యం ఆసక్తికరం..
తమకు కావాల్సిన ఓ అరుదైన బాక్స్ కోసం విలన్ గ్యాంగ్ వెతుకుతుంటుంది. అది హీరో, హీరోయిన్ దగ్గర ఉందని భావించిన గ్యాంగ్.. వారిని గుర్తిస్తుంది. అదే సమయంలో హీరో చేతిలోని గన్ అనుకోకుండా పేలడంతో పరిస్థితి ఒక్కసారిగా మారుతుంది.
విలన్ గ్యాంగ్ ఎదురుకాల్పులు ప్రారంభించే సమయంలో రెట్రో స్టైల్లో వెవెలా ఊహలే చూపినా.. పాట సాగుతుంది. కిట్టు విస్సాప్రగడ రాసిన ఈ పాటను శ్రీ సాగర్ పాడారు. విభిన్న బ్యాక్‌డ్రాప్, మ్యూజిక్‌తో పాట ఆకట్టుకునేలా ఉందని చిత్రబృందం తెలిపింది.
* మేఘాలయాలోనే పూర్తి షూటింగ్..
సినిమా చిత్రీకరణను మేఘాలయాలోనే పూర్తి చేసినట్లు నిర్మాత వేణు దోనేపూడి తెలిపారు. చిరపుంజి వంటి అందమైన లొకేషన్లలోనూ షూటింగ్ నిర్వహించినట్లు చెప్పారు. మేఘాలయాలో పూర్తిగా చిత్రీకరణ జరుపుకున్న తొలి దక్షిణాది సినిమా ఇదేనని పేర్కొన్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నాయని, పక్కా ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేశామని నిర్మాత తెలిపారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, కశ్యప్, రాజారవీంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని స్టీఫెన్, ఆనంద్ అందిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
